జూలై 15 నుంచి శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి దేవి నవరాత్రి మహోత్సవాలు
Published by
brbalu360
on
శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామీజీ ఆశీస్సులతో, శ్రీ శ్రీ శ్రీ రామ్యానంద భారతి స్వామిని ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అలంకార సేవలు, దేవి ఉపాసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి కోసం ప్రత్యేక వారాహి దేవి ఆరాధన చేపడతామని పేర్కొన్నారు. మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక దర్శనం, ప్రసాద వితరణ, ఆధ్యాత్మిక ప్రవచనాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడిస్తూ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరారు.
Leave a comment