తిరుపతి: అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు తెలిపారు. 26 జిల్లాల నుంచి సుమారు 14 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను స్మరించుకుంటూ స్పోర్ట్స్‌ డే సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. తిరుపతిలో జరిగే పోటీలను హోంమంత్రి అనిత, ఇన్‌చార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని రవినాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాయింట్ కలెక్టర్ ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టర్,మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment