
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి జీవితాంతం కొనసాగించే నిరంతర అధ్యయనమని అన్నారు. మారుతున్న చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయవాదులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, నైతిక విలువలు, క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలకు న్యాయం అందించడం ప్రతి న్యాయవాది ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.
అనంత లా కాలేజీ ప్రిన్సిపాల్ సిరి కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు న్యాయ విద్యతో పాటు సామాజిక బాధ్యత, న్యాయ విలువలను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Leave a comment