తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చైర్మన్ ఆర్.డి. విల్సన్… తమ హయాంలో అకాడమీ పనుల్లో పూర్తి పారదర్శకత కోసం ఓపెన్ టెండర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష్మీ పార్వతి హయాంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వర్చువల్ అకాడమీ, యూట్యూబ్ ఛానల్ వంటి అంశాలపై చేస్తున్న విమర్శలు అవాస్తవమని పేర్కొన్నారు. అకాడమీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment