
2008–09లో ఉషారాణితో పరిచయం ఏర్పడి, అనంతరం సుందరయ్య నగర్‌లో సహజీవనం చేశానని చుక్క శేఖర్ తెలిపారు. ప్రతి నెల ఇంటి ఖర్చుల పేరుతో రూ.50 వేల వరకు తీసుకోవడంతో పాటు, రూ.1 కోటి విలువైన ఇల్లు కొనివ్వాలని ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. తన కుమార్తె బంగారు గొలుసును కుదువ పెట్టించి రూ.90 వేల వరకు తీసుకుందని, తన కరెంట్ అకౌంట్ నుంచి రూ.6 లక్షలు, మరో ఇద్దరి మొబైల్ నంబర్ల ద్వారా రూ.15 లక్షలు పంపించానని పేర్కొన్నారు. మొత్తం తన నుంచి కోటికిపైగా రూపాయలు తీసుకుందని ఆరోపించారు. డి. సుబ్రహ్మణ్యం తనను దుర్భాషలాడారని, డబ్బు ఇవ్వకపోతే కమ్యూనిస్టులను పంపిస్తానంటూ ఉషారాణి బెదిరించేదని తెలిపారు. రవి మృతికి కారణమైన ఉషారాణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Leave a comment