తిరుపతిలో నిర్వహించిన “జినోమ్ హబ్” వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిని పవర్ఎక్స్, ఇంపాక్ట్ క్యాటలిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు.
కరకంబాడి రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన జినోమ్ హబ్ కార్యక్రమంలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక జన్యు పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించడంతో పాటు, వ్యక్తికి ఏ మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.
సమాజ హితం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ సేవలను అందిస్తున్నామని, విదేశాల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ పరీక్షలను కేవలం రూ.30 వేలకే తిరుపతిలో అందుబాటులోకి తీసుకువచ్చామని సంస్థ డైరెక్టర్లు మద్దూరి విజయ్, మబ్బు జోష్ణరెడ్డి వెల్లడించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు వైద్య సేవలు అందించగా, అనంతరం నగర వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు

Leave a comment