మోక్ష గ్రాండ్‌లో ఘనంగా ప్రారంభమైన తిరుపతి ఎక్స్‌పో – సీజన్-1
Published by
brbalu360
on
మహిళా సాధికారత, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో మోక్ష గ్రాండ్‌లో నిర్వహించిన తిరుపతి ఎక్స్‌పో – సీజన్-1 సందర్శకులను ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన మన్నూరు సుగుణమ్మ ఎక్స్‌పోను ప్రారంభించి వివిధ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం అధికారిక అతిథులు అన్న అనిత, బట్టే వెంకట కీర్తితో కలిసి ఎగ్జిబిటర్లతో మాట్లాడి వారి ఉత్పత్తులను పరిశీలించారు. వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళలు, ఫుడ్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేష స్పందన లభించింది. మహిళా వ్యాపారవేత్తలకు ఇటువంటి వేదికలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని అతిథులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నిర్వాహకులు, వ్యాపారవేత్తలు, మహిళలు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a comment