ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ సందర్శకులకు అవకాశం కల్పించగా, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వైద్యులు, ప్రముఖుల కోసం ప్రత్యేక ఫోరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీన్ సీక్వెన్సింగ్, జన్యు పరీక్షల ప్రాముఖ్యత, వ్యాధుల నివారణలో ఆధునిక సాంకేతికత, ప్రివెంటివ్ హెల్త్‌కేర్ అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. ప్రజలు, వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తాజా వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు మధ్యాహ్న, రాత్రి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.

Leave a comment