తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో రూ.5.5 కోట్లతో నిర్మించిన ఆలమ్నీ హోమ్‌ను ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికల వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు. అలాగే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు విస్తరించి రైతులకు అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం నేల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మెగా ర్యాలీ నిర్వహించారు.

Leave a comment