తిరుపతిలో తపన కాయిన్స్ మహా ఎగ్జిబిషన్ గ్రాండ్ ఓపెనింగ్
Published by
brbalu360
on
తపన కాయిన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమవరం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన తపన కాయిన్స్ మహా ఎగ్జిబిషన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టూడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, తిరుపతి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజేష్ కుమార్ రెడ్డి, బద్రి, అంజలి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అరుదైన నాణేలు, చారిత్రక కరెన్సీ నోట్లు, వివిధ దేశాల కాయిన్స్‌ను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. నాణేల సేకరణపై యువతలో అవగాహన పెంపొందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
Leave a comment