ప్రేమ పేరుతో తనను మోసం చేశారని హిజ్రా పలని గంగ ఆరోపించారు. ఓ వ్యక్తి శ్రీకాళహస్తి వాసుడు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, తన వద్ద నుంచి సుమారు రూ.23 లక్షలు ఖర్చు చేయించాడని తెలిపారు. దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల ఊబిలో చిక్కుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తనను దూరం చేసుకుని మరో వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Leave a comment