తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత, హీరో ఉమేష్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కె.ఎస్. సినిమాస్ పతాకంపై అలిమేలుమంగ ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న ‘దిష్టిబొమ్మ’ హర్రర్ సినిమాను కేవలం రెండు వారాల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసినట్లు తెలిపారు. సుమారు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని, అందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment