తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ సంఘాల స్వామీజీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ మతం, ఆలయాలు, సంప్రదాయాలను కాపాడే రాజకీయ పార్టీలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ భావాలను దెబ్బతీసే విధంగా చర్యలు జరిగాయని ఆరోపించారు. హిందూ ఆచారాల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రజలు ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Leave a comment