తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన భాను ప్రకాష్ రెడ్డి, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పన్నెండు సంవత్సరాలుగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మోదీ పాలనలో భారత్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ఈ కాలం స్వర్ణ భారత్‌గా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Leave a comment