తిరుపతి గాంధీ రోడ్డులోని కస్తూర్బా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కస్తూర్బా ట్రస్ట్, పిసి రాయల్ సంయుక్తంగా వెయ్యి మంది పేద ప్రజలకు మహా అన్నదానం చేపట్టారు. అలాగే అవసరమైన వారికి చీరలు, ధోవతులు, టవల్స్ పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సేవే పరమావధిగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సామంచి శ్రీనివాసులు బిజెపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మోహన్, స్వచ్ఛంద  సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment