తిరుపతి నగరంలోని డీబిఆర్ హాస్పిటల్ రోడ్డులో నూతనంగా నిర్మించిన రాగా ఇన్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను ప్రారంభించారు. అనంతరం హోటల్‌లోని సౌకర్యాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. తిరుపతికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతి సేవలు అందించాలనే లక్ష్యంతో హోటల్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, హోటల్ యాజమాన్యం పేరం.వెంకటరమణ,, పేరం. రాధిక కిరణ్,స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment