ప్రముఖ బుల్లితెర నటుడు ఇంద్రనీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ వారికి స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఇంద్రనీల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment