తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం లో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారు గజవాహనంపై దివ్యంగా విహరించారు. విశిష్ట అలంకరణలతో సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ వైభవంగా సాగింది. గజవాహనం ఐశ్వర్యం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

Leave a comment