
తెలుగుదేశం పార్టీ వార్షిక మహోత్సవం ‘మహానాడు – 2026’ శ్రేణుల ఉత్సాహం మధ్య ఘనంగా ప్రారంభమైంది. పార్టీ వ్యవస్థాపకులు, మహానేత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి ఘన నివాళులర్పిస్తూ ఈ ప్రతిష్టాత్మక సభను ప్రారంభించారు.
ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుండటం విశేషం. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ఆనాడు మహిళలకు ఆస్తి హక్కులు కల్పించి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం… నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
Leave a comment