తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ.. కులాల మధ్య చిచ్చు పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా సహకరిస్తూనే సీఎం పదవిని సాధించలేకపోయిన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనేది కాపు–బలిజ జాతి ఆకాంక్ష అని పేర్కొన్నారు. బలిజ జాతికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Leave a comment