
భూమన వెంటనే క్షమాపణ చెప్పాలి. భానుప్రకాశ్ రెడ్డి
స్వామీజీలపై భూమన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భూమన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్వామీజీలపై భూమన చేసిన వ్యాఖ్యలను పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెండు పర్యాయాలు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వ్యక్తికి హిందూ సంప్రదాయాలు, స్వామీజీలపై గౌరవం లేకపోవడం బాధాకరమన్నారు. భూమన చేసిన నీచమైన వ్యాఖ్యలే ఆయనకు స్వామీజీలపై ద్వేషం ఉందనడానికి నిదర్శనమని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలు, హిందూ దేవతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడి, ఇప్పుడు తిరుమలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. వెంటనే భూమన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Leave a comment