
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు సమిష్టిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తిరుపతి జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య నియోజకవర్గ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి గారు, తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Leave a comment