
ఈ ఎగ్జిబిషన్లో హ్యాండ్లూమ్ చీరలు, హ్యాండ్బ్లాక్ ప్రింట్స్, కాటన్, లినెన్, సిల్క్, బనారసీ, ఇకత్, జామ్దాని చీరలతో పాటు సంప్రదాయ హస్తకళ ఉత్పత్తులు, మహిళల కోసం ప్రత్యేక డిజైనర్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం 50 స్టాళ్లలో నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు నిర్వాహకురాలు సాహిత్య తెలిపారు. కొత్త డిజైన్లు, ప్రత్యేక ఆఫర్లతో కుటుంబ సమేతంగా వచ్చి ఈ రెండు రోజుల ప్రదర్శనను సందర్శించాలని ఆమె ఆహ్వానించారు.
Leave a comment