ఆగస్టు 1, 2 తేదీల్లో తిరుపతి ఎం కన్వెన్షన్‌లో ‘లావిష్ పాప్-అప్ అండ్ ఎగ్జిబిషన్’ను నిర్వహిస్తున్నారు. కాశ్మీర్, వారణాసి, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన వెండర్లు తమ ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నారు.
ఈ ఎగ్జిబిషన్‌లో హ్యాండ్లూమ్ చీరలు, హ్యాండ్‌బ్లాక్ ప్రింట్స్, కాటన్, లినెన్, సిల్క్, బనారసీ, ఇకత్, జామ్‌దాని చీరలతో పాటు సంప్రదాయ హస్తకళ ఉత్పత్తులు, మహిళల కోసం ప్రత్యేక డిజైనర్ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం 50 స్టాళ్లలో నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు నిర్వాహకురాలు సాహిత్య తెలిపారు. కొత్త డిజైన్లు, ప్రత్యేక ఆఫర్లతో కుటుంబ సమేతంగా వచ్చి ఈ రెండు రోజుల ప్రదర్శనను సందర్శించాలని ఆమె ఆహ్వానించారు.

Leave a comment