తిరుపతిలో మాజీ మంత్రి పరసారత్నం సతీమణి పరసా కస్తూరి రత్నం 6వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అంబేద్కర్, పూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో భారీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆనంద్ రావ్, ఎమ్మెల్యేలు విజయశ్రీ, సునీల్ కుమార్, రామకృష్ణ, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూరజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది ప్రజలకు వివిధ విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం ప్రజలకు భోజన సదుపాయం కల్పించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ…
పరసా కస్తూరి రత్నం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ప్రజలకు వైద్యం, రక్తదానం, భోజన సదుపాయం వంటి సేవలను అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment