బ్రాండెడ్‌ ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌తో అందించేందుకు హాఫ్‌పే డాట్‌కామ్‌ ముందుకొచ్చింది. మధ్యవర్తులు, అదనపు పంపిణీ ఖర్చులను తగ్గించి తయారీదారుల నుంచి నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ తిరుమలరావు తెలిపారు. ఎంఆర్‌పీపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఎలక్ట్రానిక్స్‌, వాచీలు, టెక్స్‌టైల్స్‌ సహా ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు హాఫ్‌పేలో అందుబాటులో ఉంటాయని సంస్థ డైరెక్టర్‌ తిరుమలరావు తెలిపారు. బాటా వంటి ప్రముఖ బ్రాండ్ల గోదాముల నుంచి నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

హాఫ్‌పే సేవలను ప్రజలకు పరిచయం చేసేందుకు ఆగస్టు 15, 16 తేదీల్లో తిరుపతి హైవేపై ఉన్న కోర్ట్‌యార్డ్‌ హోటల్‌లో రెండు రోజుల ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ప్రదర్శనకు హాజరై ఉత్పత్తులను ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చన్నారు.

తిరుపతిలో ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరులో కార్యాలయం ఉన్న హాఫ్‌పే.. భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ బ్రాండ్లను తమ వేదికపైకి తీసుకువచ్చి నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తిరుమలరావు తెలిపారు

Leave a comment