ఇందిరా మైదానం నుంచి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా ర్యాలీ కొర్లగుంట మీదుగా నారాయణ స్కూల్ వరకు కొనసాగింది. సుమారు 300 మంది విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ సెంట్రల్ మండలం జనరల్ సెక్రెటరీ మద్దేరి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్, గంగమ్మ గుడి బోర్డు సభ్యుడు చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి, దీపక్ యాదవ్, సురేష్ నాయక్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాలతో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Leave a comment