విజయనగరంలోని అగ్రహారంలో నివసించే గొప్ప కవి, పండితుడు విశ్వనాథ శాస్త్రి తన కవిత్వం, కథలు, నాటకాలతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు.
అయితే విశ్వనాథ శాస్త్రి ప్రతిభను చూసి ఓర్వలేని విరూపాక్షి కవి, అతని కీర్తిని దెబ్బతీయాలని కుట్ర పన్నుతాడు.
ఈ క్రమంలో తులసి అనే మహిళ విశ్వనాథ శాస్త్రి జీవితంలోకి వస్తుంది. తొలుత కుట్రలో భాగంగా వచ్చిన తులసి.. విశ్వనాథుడి ప్రేమ, ఆదరణకు ఆకర్షితురాలై అతనికి దగ్గరవుతుంది.
ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం క్రమంగా అమర ప్రేమగా మారుతుంది.
కానీ విరూపాక్షి కుట్రలతో తులసిని బలవంతంగా తీసుకెళ్లడంతో విశ్వనాథ శాస్త్రి తీవ్ర మనోవేదనకు గురవుతాడు.
చివరకు ప్రేమ, త్యాగం, విషాదంతో కూడిన సంఘటనలు చోటుచేసుకుని.. తులసి, విశ్వనాథ శాస్త్రి ప్రేమకథ విషాదాంతంగా ముగుస్తుంది.
అసూయతో ఎదుటివారి ప్రతిభను అణిచివేయాలనుకోవడం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో తెలియజేస్తూ.. నిజమైన ప్రేమకు ప్రతీకగా నిలిచిన “అమర ప్రేమ” నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Leave a comment