తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు విద్యాధరి మునిపల్లె రచించిన “అమర ప్రేమ” నాటకాన్ని ప్రదర్శించారు.
విజయనగర నేపథ్యంలో సాగిన ఈ నాటకం… గొప్ప కవి విశ్వనాథ శాస్త్రి, తులసి మధ్య ఏర్పడిన స్వచ్ఛమైన ప్రేమ, కవుల మధ్య నెలకొన్న అసూయ, ఓర్వలేని తనం వంటి అంశాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించింది.
కేవలం ఎదుటి వ్యక్తి ప్రతిభను తట్టుకోలేకపోవడం ఎలాంటి విషాదానికి దారితీస్తుందో… నిజమైన ప్రేమ ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుందో నాటకం ద్వారా చక్కగా చూపించారు.
కళాకారుల అద్భుత నటన, భావోద్వేగ సన్నివేశాలు, సంగీతం, రంగస్థల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటకాన్ని వీక్షించిన ప్రేక్షకులు కళాకారుల ప్రతిభను అభినందించారు.

Leave a comment